ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గతంలో కన్నా కేసుల సంఖ్య ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది. భారత్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే కరోనా ప్రభావం తగ్గినట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ వచ్చే వరకు అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు.
కరోనా నుంచి కోలుకున్న పురుషుల్లో అంగస్తంభన సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు గుర్తించారు. ఈ మేరకు వారు తాజాగా పురుషులను హెచ్చరించారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ చాలా మందికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక పురుషుల్లో ముఖ్యంగా అంగస్తంభన సమస్యలు వస్తున్నాయి. ఇది వారి శృంగార జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అని వైద్య నిపుణులు తెలిపారు.
అందువల్ల ఎవరైనా సరే అనవసరంగా కరోనాతో ఇబ్బందులు తెచ్చుకోకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్‌ను ధరించాలని, సోషల్ డిస్టన్స్ పాటించాలని చెబుతున్నారు.