కరోనా వైరస్ పుణ్యమా అని రాబోయే రోజులు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు లాగా చేతులు కలపడం, కౌగిలించుకోవడం లాంటివి మాయమయి, ఓన్లీ నమస్కారాలే నడవనున్నాయి. అంతేకాదు సోషల్ డిస్టెన్స్ పాటించటం ఇక మనిషి జీవితంలో భాగం కానుంది. మరో రెండు మూడు సంవత్సరాల వరకు కరోనా ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పలు కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూన్నాయి.అందులో భాగంగా వర్క్ ఫ్రం హోం ను ప్రిఫర్ చేస్తున్నాయి. లాక్ డౌన్ టైం లో ఇప్పటికే ఐటీ కంపెనీలతో పాటు పలు ప్రైవేటు కంపెనీలు సంస్థలు ఈ తరహా మార్గంలోనే నడుస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లోనూ 25 శాతానికి పైగానే ఉద్యోగులు ఇకపై ఇంటి నుంచే పని చేస్తారా అన్న దానికి బలం చేకూరుతోంది. ఆగస్టు నెల ఆఖరి వరకూ చాలావరకు ఐటి మల్టీనేషనల్ కంపెనీ లందరికీ వర్క్ ఫ్రం హోం అనుమతినివ్వాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి.
దీంతో కంపెనీలు కూడా అదే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ఈ విధంగానే వ్యవహరించాలని ప్రభుత్వాలు మరియు కంపెనీలు అనుకుంటున్నాయి. మొత్తంమీద చూసుకుంటే ఆగస్టు నెల ఆఖరు వరకూ ఉద్యోగస్థులు అంతా చాలా వరకు ఇంట్లోనే తమ కార్యకలాపాలు చేయబోతున్నారు అని చెప్పవచ్చు.