కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయపడిపోతున్నారు. మన దేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. మన దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. మహారాష్ట్రలో డబుల్ సెంచరీ ని దాటాయి కరోనా వైరస్ కేసులు. సాంగ్లి జిల్లా ఇస్లామ్‌పూర్‌లో ఓ ఉమ్మడి కుటుంబంలో మొదట నలుగురు కుటుంబ సభ్యులు సౌదీ అరేబియాలో పర్యటించారు.
మార్చి 23న వారికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. అనుమానంతో కుటుంబ సభ్యలందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించి పరీక్షలు చేసారు. మిగిలిన 21 మందికి కరోనా వైరస్ సోకింది. అందులో రెండేళ్ల బాలుడు కూడా కరోనా వైరస్ బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. మొత్తం 47 మందికి టెస్ట్‌లు చేయగా 25 మంది కరోనా వైరస్ బారిన పడటం ఇప్పుడు అక్కడి అధికారులను సైతం భయపెట్టింది.
మహారాష్ట్రలో ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కేసులు నమోదు కాలేదు. కాని ఈ కుటుంబంలో ఒకేసారి ఇంత మందికి కరోనా వైరస్ బయటపడటంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 215 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం కొత్తగా మరో 12 మంది కరోనా పడ్డారు. మరణాలు కూడా నిదానంగా పెరగడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు.