ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడమే కాకుండా మరణాలు కూడా అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ నేపధ్యంలో అన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా సరే… ఇప్పుడు కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశం గా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు అదుపులో ఉన్న మరణాలు ఇప్పుడు పెరుగుతున్నాయి.
దీనితో ఇప్పుడు మరణాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా యువకులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితోనే ఇప్పుడు ప్రపంచం మొత్తం భయపడుతుంది. ఇటలీ లో వృద్దులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే చిన్న పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. దీనితో అక్కడి ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
మన దేశంలో కూడా చిన్న పిల్లలు ఎక్కువగా కరోనా బారిన పడటం ఇప్పుడు ప్రభుత్వాన్ని కలవరపెడుతుంది. తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్న చిన్న పిల్లలు కరోనా బారిన పడుతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వారికి కరోనా సోకుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో తాజగా ముగ్గురు పిల్లలకు కరోనా పాజిటివ్ రావడం తో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.