ఫ్యాక్ట్ చెక్: కేంద్ర ప్రభుత్వం నుంచి కరోనా ఫండ్…జనవరి 15 వరకే గడువు.. నిజమెంత..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలకి అంతులేకుండా పోతోంది. ప్రతిరోజు సోషల్ మీడియా లో ఏదో ఒక నకిలీ వార్త వస్తోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా ఫేక్ వార్తలు వస్తున్నాయి. పైగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా మోసగాళ్లు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఉపాధి లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పడటం ఇలాంటివి కరోనా కారణంగా సంభవిస్తున్నాయి.

దీనిని ఆసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ 19 పేరుతో ఏదో ఒక మోసం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా ఫండ్ నుంచి ప్రజలకు ఐదు వేల రూపాయల అందిస్తోందని మెసేజ్ వస్తోంది. ఇది చూసి నెటిజన్లు ఈ మెసేజ్ ని తెగ షేర్ చేస్తున్నారు.

పైగా 15 వరకే గడువు ఉందని మెసేజ్ లో ఉంది. అయితే నిజానికి కేంద్రం ఇలాంటి స్కీమ్ తీసుకురాలేదు. మోసగాళ్లు కరోనా ఫండ్ పేరుతో మోసం చేస్తున్నారు. ఈ మెసేజ్ పై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా క్లారిటీ ఇచ్చేసింది. కేంద్రం ఇలాంటి పథకాన్ని తీసుకు రాలేదు అని చెప్పేసింది.

పైగా ఎవరికైనా ఇలాంటి మెసేజ్లు వస్తే అస్సలు నమ్మి షేర్ చెయ్యద్దు. ఫార్వర్డ్ చేయొద్దు అని చెప్పింది. అనవసరంగా లేనిపోని లింక్స్ మీద క్లిక్ చేసి పీకలదాకా తెచ్చుకోవద్దు. తెలియని వాళ్ళకి బ్యాంక్ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని చెప్పకండి. అలానే వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news