పంజాబ్ ఎన్నికలు: వచ్చే వారం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం: ఆప్ చీఫ్

-

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని గురువారం ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రవాల్ తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంజాబ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. గతంలో జరిగన సంఘటనల్లో బాధితులకు న్యాయం జరగడంతోపాటు దోషులకు కఠిన శిక్షలు పడతాయి అని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి భద్రతకు సంబంధించిన విషయమైనా లేదా సామాన్యుల భద్రకు సంబంధించిన విషయమైన అందిరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. వచ్చే వారం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉంటారని గత ఏడాది అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news