కోరలు చాస్తున్న కరోనా… పెరుగుతున్న ‘ ఆర్’ వ్యాల్యూ

-

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ తప్పదా… కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఇందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మాస్క్ తప్పని సరి చేస్తూ ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. కేంద్రం కూడా ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, యూపీ, మిజోరాం రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. పెరుగుతున్న కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని… వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించింది. 

ఇదిలా ఉంటే మరో వైపు ‘ ఆర్ ’ వాల్యూ పెరుగుతోంది. కోవిడ్ వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వ్యాల్యూ( R) వాల్యూ మూడు నెలల్లో తొలిసారిగా ఒకటి దాటింది. అంటే కోవిడ్ ఇన్ ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి కరోనా సోకుతున్నట్లు ఆర్ వ్యాల్యూ సూచిస్తోంది. గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు ఆర్ వ్యాల్యూ 3,4 వరకు కూడా చేరింది. ఆ తర్వాత ఒకటి కన్నా తక్కువగా నమోదు అవుతూ వచ్చింది. కాగా ప్రస్తుతం ఆర్ వ్యాల్యూ 1కి చేరుతుంది అంటే… మళ్లీ ఇప్పడు కరోనా వ్యాప్తి పెరుగుతోందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news