కరోనా సోకిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే దీని పై లోకల్ పరిస్థితులను బట్టి దేశాలు నిర్ణయం తీసుకోవాలని డబ్యూహెచ్‌వో అధికారులు తెలిపారు. కరోనా, ఓమిక్రాన్ బారిన పడిన వారు కేవలం ఆరు నుంచి ఏడు రోజుల్లోనే కొలుకుంటున్నారని తెలిపారు. అయితే వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండటమే మంచిదని సూచించారు. ముందుగా జనాల్లోకి వస్తే ఇన్ ఫ్ల్యూయెంజాతో పాటు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అందు కోసం తప్పక 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ పట్ల కూడా ప్రజలు జాగ్రత్త గా ఉండాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. అలాగే ఓమిక్రాన్ అంత వేగంగా విస్తరించే వైరస్ ఇప్పటి వరకు లేదని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ జగ్రత్తగా ఉండాలని సూచించారు.