మహారాష్ట్రలో రెచ్చిపోతున్న కరోనా, జాగ్రత్త తెలంగాణా…!

-

తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అక్కడ ఒక్కరోజే దాదాపు 13 కేసులు నమోదు కావటం అక్కడి ప్రజలను కలవరపెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మహారాష్ట్రలో దాదాపు కరోనా70 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే వారందరూ ఎవరిని కలిశారు, వారందరూ ఎక్కడ ప్రయాణం చేశారు. ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎక్కడైనా ఆ రైలు లేదా విమాన లో ప్రయాణాలు చేశారా.. అనేది ఇప్పుడు అధికారులకు అర్థం కావటంలేదు.

నాగపూర్ సహా పలు ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తోం.ది నాగపూర్ ,తెలంగాణ సరిహద్దులకు దగ్గరగా ఉంది. హైదరాబాద్ కి చెందిన చాలా మంది పూణే వెళ్ళి వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు జాగ్రత్తగా ఉంటే మంచిది అని పలువురు సూచిస్తున్నారు. ఇది పక్కన పెడితే మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా నిలిపివేసే విధంగా వద్ద ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రైళ్లు ,బస్సులు ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలు అదేవిధంగా క్యాబ్ సర్వీసులను పూర్తిగా నిలిపి వేయాలని అక్కడి ప్రభుత్వం యోచనలో ఉంది.

ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కంపెనీలను మూసివేయాలని ఉద్యోగులు ఎవరిని ఇల్లు దాటి బయటకు రావద్దు అని చెప్పి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ విస్తరిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. అదేవిధంగా రెండు మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండటంతో అక్కడికి కరోనా వైరస్ అత్యంత వేగంగా వచ్చింది ,మహారాష్ట్రలో పరిస్థితి చేయి దాటకుండా ఉండేవిధంగా అక్కడి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news