పార్లమెంట్ లో కరోనా కల్లోలం.. 350 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

-

దేశంలో రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య లక్షను దాటింది. ఇదిలా ఉంటే పార్లమెంట్ ను కరోనా కేసులు కుదిపేస్తున్నాయి. గత రెండు రోజులుగా జరుగుతున్న కరోనా పరీక్షల్లో.. 350 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్ల కాంటాక్ట్ లకు కూడా పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే గత నెలలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఆ సమయంలో ఇలా కరోనా కేసులు వస్తే ఇబ్బందులు ఎదురయ్యేవి.

పార్లమెంట్

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాాయి. రోజురోజుకు కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే అధికారికంగా దేశంలో ఓమిక్రాన్ కేసులు సంఖ్య 3వేలను దాటాయి. అయితే ప్రస్తుతం వచ్చే కేసుల్లో దాదాపుగా సగాని కన్నా పైగా.. ఓమిక్రాన్ కేసులే ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news