తమకు ఆస్పత్రిలో ఆహారం, సరైన వైద్యం కల్పించడంలేదంటూ చెన్నైలోని ముత్తుకుమారన్ మెడికల్ కాలేజీలోని పలువురు కరోనా పేషెంట్లు ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరోనా రోగులు రోడ్డు మీదకు రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. కరోనా పేషెంట్లు అంతా కలిసి సరైన వైద్యం కల్పించడంలేదంటూ ఆందోళన చేపట్టారు. పలు విషయాలపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, తమిళనాడులో గత 24 గంటల్లో కొత్తగా 6,472 కరోనా పాజిటివ్ కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,92,964కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 3,232 మంది మరణించారు. తమిళనాడులో ఇప్పటివరకు కరోనా నుంచి 1,36,793 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి.