కాంగ్రెస్ కంటే ఘోరంగా అంతర్గత కుమ్ములాటలు… అందుకే ఇండియా-చైనా యుద్ధం!

-

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఈ మధ్య వరుసబెట్టి రాహుల్ గాందీ ట్విట్టర్ లో ధ్వజమెత్తుతున్నారు. కేవలం సొంత ఇమేజ్‌ని పెంచుకోవడానికే ప్రధాని నరేంద్ర మోడీ వందశాతం ఏకాగ్రత పెంచుకుంటున్నారని వెల్లడించారు. దేశంలోని వివిధ సంస్థలు ఇదే పనిలో బాగా బిజీ అయిపోయాయని విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే… ఓ నేత వ్యక్తిగత ఇమేజ్ జాతీయ భావానికి ఎంతమాత్రం కొలమానం కాదని అన్నారు. అలాగే… చైనా, భారత్ మధ్య తలెత్తిన ఘర్షణాత్మక వాతావరణంపై కూడా ఓ వీడియోను పోస్ట్ చేశారు.

“భారత్ పూర్తిగా రెడీ అయ్యి.. బలంగా ఉంటే చైనాతో పోరాటం చేయవచ్చు కానీ.. అలా కాకుండా ఏమాత్రం బలహీనంగా ఉన్నా కూడా అది సమస్యగా మారుతుంది.. ఫలితంగా చైనా మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది.. అసలు చైనాతో పోరాటం చేయాలంటే ఓ దృష్టి కోణం ఉండాలి.. అందులో అంతర్జాతీయ దృష్టికోణం అత్యావశ్యకం” అంటూ రాహుల్ వెల్లడించారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి దీర్ఘదృష్టి లేని కారణంగానే పెద్ద అవకాశాన్ని కోల్పోయామని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. మనలో మనమే ఘర్షణకు దిగుతున్నామన్న విషయం తాజా రాజకీయాలను చూస్తే అర్థమైపోతుందని స్పష్టం చేశారు. కాగా “భారత్.. భారత్ ‌తోనే పోరాడుతోందని.. ప్రభుత్వానికి ఓ దృష్టి కోణమంటూ లేదని చెప్పడానికి ఇదో తార్కాణం” అని రాహుల్ గాంధీ వివరించారు. దీనిపై బీజేపీ క్యాడర్ సెటైర్స్ వేస్తుంది.

రాహుల్ అన్న విషయాన్ని పట్టుకొని “ఇండియా ఇండియాతో పోరాడుతుందని.. అవి నిజంగా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్మలాటలకంటే ఓవర్ గా ఉన్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఉందని” సెటైర్స్ పేల్చుతున్నారు బీజేపీ నేతలు!! ఇదే కదా… ఇండియా ఇండియాతోనే యుద్ధం చేయడం అంటే..!!

Read more RELATED
Recommended to you

Latest news