కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో ఎన్ని పాజిటివ్ కేసులంటే..!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా రోజువారీ కేసులతోపాటు మరణాలు కూడా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 45 వేల 951 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 817 మంది మృతి చెందారు. కరోనాతో చికిత్స పొంది 60 వేల 729 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకూ దేశంలో 3 కోట్ల 36 లక్షల 2 వేల 848 మందికి కరోనా సోకింది. 2 కోట్ల 94 లక్షల 27 వేల 330 మంది చికిత్స పొంది కోలుకున్నారు. ఇంకా 5 లక్షల 37 వేల 64 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ 3 లక్షల 98 వేల 454 మంది కరోనాతో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా 33 కోట్ల 28 లక్షల 54 వేల 542 మంది టీకా తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.