దేశంలో తాజాగా కరోనా కేసులు ఎన్నో తెలుసా?

-

న్యూఢిల్లీ: దేశంలో తాజాగా కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 46 వేల 617 మందికి కరోనా సోకింది. కొత్తగా 853 మంది మరణించారు. మొత్తం 59 వేల 384 మంది బాధితులు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ దేశంలో 3 కోట్ల 4 లక్షల 58 వేల 251 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వైరస్‌ ప్రభావంతో 4 లక్షల 312 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 2 కోట్ల 95 లక్షల 48 వేల 302 మంది కరోనా రోగులు కోలుకున్నారు.

ప్రస్తుతం 5 లక్షల 9 వేల 637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 34 కోట్ల 76 వేల 232 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. మిగిలివాళ్లు కూడా టీకాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. ప్రభుత్వం సూచించిన సైట్ల ద్వారా టీకా కోసం పేరు నమోదు చేయించుకోవాలని పేర్కొంది. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. ఉదయాన్నే యోగా లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది. మాస్కులు, బౌతిక దూరం పాటించాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news