ఆ సెంటిమెంట్ హుజూరాబాద్‌ లో వర్కౌట్ అవ్వదా?

-

 ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వంల మధ్య నీటి వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఎంతో సన్నిహితంగా ఉండే కేసీఆర్-జగన్‌లు సమస్య గురించి చర్చికోకుండా మాటల యుద్ధానికి దిగడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా కడుతున్నారని చెప్పి తెలంగాణ మంత్రులు, జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇక చనిపోయిన వైఎస్సార్‌పైన కూడా మంత్రులు విమర్శలు చేస్తున్నారు.అటు ఏపీ మంత్రులు, తెలంగాణ మంత్రులకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నీటి వివాదంపై చర్చించుకోకుండా ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై రెండు రాష్ట్రాల ప్రజలకు అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు. పైగా చనిపోయిన వైఎస్సార్‌ని కూడా తిడుతున్నారంటే ఇందులో రాజకీయ ప్రయోజనం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్ huzurabad ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ప్రభుత్వం నీటి వివాదాన్ని తీసుకొచ్చిందని అంటున్నారు.

హుజూరాబాద్/ huzurabad
హుజూరాబాద్/ huzurabad

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపపోరు ఖాయమైంది. ఈ పోరులో ఈటలకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ చూస్తుంది. అందుకే ఎప్పటిలాగానే తెలంగాణ సెంటిమెంట్‌ని తెరపైకి తీసుకొచ్చిందని, గతంలో ఇలా పలుమార్లు ఏపీతో కయ్యం పెట్టుకున్నట్లు చేసి, ఎన్నికల్లో లబ్ది పొందిందని, ఇప్పుడు అదే చేస్తుందని చెబుతున్నారు.

అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్ళు, నియామకాలు, నిధులు గురించి..ఇప్పుడు అదే నీటి సెంటిమెంట్‌తో హుజూరాబాద్‌లో గెలవాలని టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలు వేస్తుందని, కానీ ఈ సారి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఈ నీటి సెంటిమెంట్‌కు తెలంగాణ ప్రజలు పడిపోరని, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ని ఓడిస్తారని ప్రతిపక్షాలు అంటున్నాయి. చూడాలి మరి ఈ సారి టీఆర్ఎస్ లేవనెత్తిన నీటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news