BREAKING : మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్

-

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ పాజిటివ్ వచ్చింది అంటూ స్వయంగా హీరో మంచు మనోజ్.. తన సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టాడు. గత వారంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే టెస్టులు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంచూ మనోజ్ కోరారు.

వైద్యుల సంరక్షణలో తాను బాగానే ఉన్నానని తెలిపిన మనోజ్.. ఎవరు కూడా దీనిపై ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే తాను కోలుకుని.. మళ్ళీ అందరి ముందుకు వస్తానని ప్రకటన చేశారు మంచు మనోజు.

కాగా చైనాలో పురుడు పోసుకున్న ఈ కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి బారిన ఇప్పటికే టాలీవుడ్ లోని ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు పడ్డారు. అంతేకాదు… కొంతమంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు ఈ కరోనా బారినపడి మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news