ఈ ఏటీఎం కార్డుతో రూ.20 లక్షల వరకు బెనిఫిట్..!

-

మీకు స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ డెబిట్ కార్డులపై ఈ బ్యాంకు ఇన్సూరెన్స్ కవరేజ్‌లను ఇస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇన్సూరెన్స్ కవరేజ్‌లను పొందొచ్చు అయితే కార్డు కార్డును బట్టి ఈ ఇన్సూరెన్స్ కవర్ లిమిట్ అనేది మారుతూ ఉంటుంది.

ఎస్‌బీఐ కార్డులపై గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్‌ను యూజర్లు పొందొచ్చు. పైగా ఎలాంటి ప్రీమియంలను చెల్లించాల్సినవసరం లేదు. ఈ ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ఎస్‌బీఐ వీసా సిగ్నేచర్, మాస్టర్‌కార్డు డెబిట్ కార్డులపై రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ వుంది.

ఒకవేళ ఎస్‌బీఐ కార్డు హోల్డర్ చనిపోతే, నామినీలు పొందవచ్చు. అయితే కొన్ని షరతులు కూడా వున్నాయి. ఇక వాటి కోసం చూస్తే.. యాక్సిడెంట్‌కి కనీసం 90 రోజుల ముందు వరకు ఈ-కామర్స్, పీఓఎస్ లేదా ఏటీఎంలలో ఈ కార్డును ఉపయోగించుండాలి. ఒకవేళ ఈ కార్డు హోల్డర్ విమాన ప్రమాదంలో ప్రాణం కోల్పోతే మాత్రం రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్‌ను బ్యాంక్ ఇస్తుంది.

కార్డుపై ప్రొటెక్షన్ కవర్‌ను కూడా యూజర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే కార్డును కొన్న 90 రోజుల లోపల కార్డు దొంగతానికి గురైతే ఈ కవర్ వర్తిస్తుంది. అదే వీటితో పాటుగా ఎస్‌బీఐ రూపే జన్ ధన్ కార్డు ఉన్న వారికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ కవర్‌ను ఇస్తోంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్ తెరిచిన వారికి ఈ రూపే కార్డును ఎస్‌బీఐ అందిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news