కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన వాల్లుక్రమంగా కోలుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 600 మంది వరకు కరోనా నుంచి బయటపడ్డారు. ఇక 180 మంది వరకు మరణించారు. ఇది పక్కన పెడితే రాజస్థాన్ లో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. అది ఏంటీ అంటే… రాజస్థాన్ లో జోద్‌పూర్‌కు చెందిన హిమాన్షు ఉత్తమ్‌చందాని అనే 37 ఏళ్ళ వ్యక్తి….
తన కుటుంబంతో కలిసి గత నెల రెండో వారంలో టర్కీలో జరిగిన ఒక వివాహానికి హాజరై… అదే నెల 18 న అతను తిరిగి భారత్ వచ్చాడు. అతని చిన్నాన్న మోహన్, పిన్ని స్పెయిన్‌కు వెళ్లిపోగా… విమానాశ్రయంలో పరీక్షల అనంతరం హిమాన్షు, ఆయన కుటుంబం జోద్‌పూర్‌కు వచ్చేశారు. మూడు రోజుల తర్వాత గొంతు సంబంధిత సమస్యతో అతను ఆస్పత్రికి వెళ్లి పరీక్షా చేయించుకున్నాడు.
కరోనా పాజిటివ్ అని వచ్చింది అతనికి అతనికి చికిత్స అందించిన వైద్యులు అతని కుటుంబాన్ని క్వారంటైన్ చేసారు. ఏప్రిల్ 6న ఆయన డిశ్చార్జి అయ్యారు. ఆయన చిన్నాన్న మోహన్‌కు మాత్రం స్పెయిన్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించకపోవడం తో అక్కడే సమస్య వచ్చింది.. 4-5 రోజుల తర్వాత ఆయనకు కరోనా లక్షణాలు కనపడటం తో వైద్యులను పిలిచి చికిత్స చేయగా ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగు పడలేదు. దీనితో ఆయన హిమాన్షు డిశ్చార్జ్ అయిన రోజే మరణించారు. స్పెయిన్ లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.