వాళ్ళకు చదువు లేదు, అయినా ప్రపంచానికి కరోనా విషయంలో చాలా నేర్పుతున్నారు…!

-

వాళ్లకు చదువు లేదు… వాళ్లకు నాగరికత లేదు. వాళ్లకు మంచి చెడు చెప్పే వాడు లేరు. వాళ్ళు ఓటు బ్యాంకు మినహా ప్రపంచానికి వాళ్ళతో ఏ అవసరం ఉండదు. అయినా సరే వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా సంస్కారంలో వెనకడుగు వేయరు. వాళ్లకు అవగాహన కాదు… మీరు ఇలా చేయండి బాగుంటారు అంటే అదే చేస్తారు. వాళ్లకు మంచి చెప్తే మంచి చేస్తారు చెడు చెప్తే దాని గురించి ఆలోచిస్తారు.

అంతే గాని ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. మనలా… వాళ్లకు సోషల్ మీడియా లేదు. కనీసం ఫోన్ సిగ్నల్ కూడా ఆ ప్రాంతంలో ఉండదు. వాళ్లకు బయటి ప్రపంచం తో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినా సరే వాళ్ళు కరోనా కట్టడి విషయంలో వేస్తున్న అడుగులు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వాళ్ళే ఉత్తరాంధ్ర గిరిజనులు.

ఉత్తారాంధ్ర మూడు జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం కేవలం విశాఖ జిల్లాకు మాత్రమే పరిమితం అయింది. అయినా సరే అక్కడి గిరిజనులు మూడు జిల్లాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. అరకు లోయ సహా ఓడిస్సా సరిహద్దున ఉండే విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వాళ్ళు సామాజిక దూరం పాటిస్తున్నారు. కరోనా అవగాహన విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. బయటకు ఏ కారణం తో వచ్చినా సరే వాళ్ళు సామాజిక దూరం మర్చిపోవడం లేదు.

మంచి నీళ్ళు కోసం వచ్చినా సరుకుల కోసం వచ్చినా వచ్చే సరే వాళ్ళు మాత్రం మూడు నుంచి ఆరు అడుగుల దూరం పాటిస్తున్నారు. తినడానికి తిండి దొరకని ప్రాంతాలు అవి. అయినా సరే రేషన్ సరుకుల కోసం మాత్రం ఎగబడే పరిస్థితి అక్కడ అసలు లేదు. వాళ్లకు ప్రత్యేకంగా అధికారులు అవగాహన ఏమీ లేదు. ఎవరో చెప్పిన మాట విన్నారు. సామాజిక దూరం పాటిస్తున్నారు. వాళ్ళను చూసి ప్రపంచం కూడా షాక్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news