మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం..!

-

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో మహారాష్ట్రలో మాత్రం విలయ తాండవం చేస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రానురానూ తగ్గుముఖం పట్టిన కరోనా.. మళ్లీ పంజా విసురుతోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 5వేలకుపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. వైరస్ మళ్లీ విజృంభిస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Maharashtra-Corona

మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 4,787 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 20,76,093 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ వైరస్ కారణంగా నిన్న ఒక్కరోజే 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో మృతుల సంఖ్య 51,631కి చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, 3,853 మంది వైరస్ బారిన పడి కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 38,013 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారం రోజుల్లో నిన్న ఒక్కరోజే 3వేలకు పైగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు అందించారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పని సరి అన్నారు. నిబంధనలు పాటించకపోతే వైరస్ వ్యాప్తి పెరుగుతుందని, అప్పుడు లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందన్నారు. కాగా, రద్దీ ప్రాంతాల్లో, బస్సు స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా తెలుసుకునేందుకు పోలీసులు అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,881 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో 1,09,50,201 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 11,987 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.32 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 101 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news