ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్..భారత్, యూఎస్‌పై తీవ్ర ప్రభావం..!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండో దశ ప్రభావం మొదలైంది..చాలా దేశాలు ఇప్పటికే దాని తీవ్రతతో అతలా కుతలం అవుతున్నాయి..కొన్ని దేశాలు మళ్లీ లాక్‌ విధించాయి..మరోకిన్ని దేశాలు పాక్షిక లాక్‌ డౌన్ అమలు చేస్తున్నారు..కరోనా బారిన పడిన దేశాలు అంతో ఇంతో కోలుకున్నా..అమెరికా, భారత్‌లో పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు..ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి..అమెరికాలో కేసులు కోటి పాతిక లక్షలు దాటాయి. ప్రపంచంలోని వంద దేశాల్లో ఉన్న మొత్తం కేసుల కంటే ఇది చాలా ఎక్కువ. గత వారం రోజుల్లోనే అమెరికాలో లక్ష మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు.మరోవైపు అమెరికాలోని 10లక్షలమంది పిల్లలకు కరోనా సోకిందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్సు ప్రకటించింది. వైరస్ ప్రారంభమైన నాటి నుంచి నవంబరు 12వరకు అమెరికాలో దాదాపు 11లక్షల మంది పిల్లలు కోవిడ్ బారిన పడ్డారు. గత వారంలోనే లక్ష 12వేల మంది పిల్లలకు కరోనా సోకింది. గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు పిల్లలు వైరస్ బారిన పడుతున్నారు. చిన్నారుల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అమెరికా ప్రభుత్వం జాతీయ వ్యూహాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నారు వైద్య నిపుణులు..అమెరికాలో దాదాపుగా 14శాతం మంది తల్లిదండ్రుల వల్లే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని సర్వేలో తేలింది.

అమెరికాలో వారం రోజుల వ్యవధిలోనే పదకొండు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాడంతో.. దేశంలోని పలు నగరాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్నాయి..వైరస్‌ విజృంభిస్తుండటంతో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 11 మిలియన్ల నుంచి 12మిలియన్లకు కరోనా కేసులు చేరాయి. దీంతో వచ్చే రెండు మూడు వారాలపాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు. డిసెంబర్‌లో క్రిస్మస్ పండగ, నూతన సంవత్సర వేడుకలు, విహారయాత్రల వల్ల వైరస్‌ విజృంభణ మరింత ఎక్కువయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

అమెరికాలో రానున్న రోజుల్లో వైరస్‌ తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. జో బైడెన్‌ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే నాటికి కరోనా కేసుల సంఖ్య 2కోట్లకు చేరుకుంటుందని అంచనా. అమెరికాలో ఇప్పటికే కోటి 22లక్షల మందిలో కరోనా సోకగా, వచ్చే జనవరి 20వ తేదీ నాటికి ఈ సంఖ్య 2కోట్లకు చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనా కన్నా ముందుతో పోలిస్తే ప్రస్తుత భౌతిక దూరం నిబంధనలు 60శాతం పాటిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది..కొత్త అధ్యక్షుడు కరోనా నియంత్రణకోసం ముందుగానే ప్రణాళికలు రచిస్తున్నారు..వైద్య సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు.ఈ భేటీలో వైద్య సిబ్బంది వ్యాఖ్యలు విని కంటతడి పెట్టుకున్నారు నూతన అధ్యక్షుడు బైడెన్‌..

భారత దేశంలో కరోనా కేసులు ఇప్పటికీ రోజూ 50వేల వరకూ నమోదవుతున్నాయి..మొత్తం బాధితుల సంఖ్య కోటికి చేరువవుతున్నాయి..ఢిల్లీ వంటి నగరాల్లో సెండ్ వేవ్ కరోనా నగరం అస్తవ్యస్తం అవుతుంది..కరోనా వైరస్‌కు తోడు వాయుకాలుష్యంతో వైరస్‌ వ్యాప్తి మరి వేగంగా వ్యాప్తి చెందుతుంది..రంగంలోకి దిగిన కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది..ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు..కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమీక్ష సమావేశంలో నిర్వహించారు.. ప్రధాని మోడీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. వివిధ కంపెనీల వ్యాక్సిన్ ట్రయల్స్‌ ముఖ్యమైన దశల్ని దాటి వినియోగానికి చేరువ అవుతుండటంతో అవి అందుబాటులోకి వచ్చాక..దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ విధానం, వ్యూహంపై ముఖ్యమంత్రులతో చర్చించబోతున్నారు..ప్రధాని మోడీ. ముందుగా, అత్యధికంగా”కరోనా” కేసులు నమోదవుతున్న 8రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పరిస్థితిని సమీక్షించనున్నారు..ప్రధాని. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సిన్‌ పంపిణీ ఎలా చేయాలన్న దానిపై సమీక్ష జరపనున్నారు..కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మూడో విడత ట్రయల్స్‌ వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తికాబోతున్నాయి. అయితే ఈలోగానే “ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా” అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం గనుక అనుమతులు మంజూరు చేస్తే, అత్యవసర పరిస్థితుల్లో ఆ వ్యాక్సిన్‌ను భారత్‌లోనూ వినియోగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

భారత్‌లో “ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా” వ్యాక్సిన్‌పై పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలో మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాకముందే వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు సీఐఐకి డీజీసీఐ అనుమతులు మంజూరు చేసే ఛాన్స్‌ ఉందంటున్నారు. అందుకే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ విధానం ఎలా ఉండాలనే దానిపై వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులతో చర్చించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news