దేశంలో కరోనా కల్లోలం.. స్మశానానికి శవాల క్యూ !

-

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గుట్టలుగా కరోనా శవాలను మోసుకొచ్చి, దింపడం వరసగా నిలుచున్న అంబులెన్సులు.. కన్నీటిని దిగమింగుతూ అంత్యక్రియల కోసం వేచి చూస్తున్న బంధువులు.. ఖాళీగా లేని శ్మశాన వాటికలు ఇవే సీన్లు దాదాపు చాలా రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా మరణాలు సంభవించాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చుయి.

281 మరణాలతో మహారాష్ట్ర ముందు వరసలో ఉండగా.. చత్తీస్‌గఢ్‌లో 156, ఉత్తర్‌ప్రదేశ్‌లో 85 మంది ప్రాణాలు విడిచారు. అయితే చాలా చోట్ల వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందనిపిస్తోంది. ప్రభుత్వాలు మరణాలను తక్కువ చేసి చూపుతున్నాయని అంటున్నారు. మరో పక్క జార్ఖండ్‌లోని రాంచీ సదార్‌ హస్పిటల్‌లో హృదయ విదాకర సంఘటన చోటుచేసుకుంది. హాస్పిటల్ పార్కింగ్ స్థలం లో కరోనా పేషెంట్ చనిపోయాడు. దీంతో  తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది పేషంట్ కూతురు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన తండ్రి చనిపోయాడని గట్టిగా అరుస్తూ సిబ్బందిపై ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news