కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలు.. రుచిని కోల్పోవడం మాత్రమే కాదు, ఈ లక్షణాలు కూడా

-

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. కరోనాను నియంత్రించడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయినా ప్రజలు మాత్రం కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సాధారణ లక్షణాలతో మొదలయ్యే ఈ వైరస్ ప్రాణానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు కరోనా సెకండ్ వేవ్ లక్షణాలకు గుర్తించి.. వైద్యులను సంప్రదించాలంటున్నారు.

కరోనా-నాలుక
కరోనా-నాలుక

అయితే కరోనా విషయంలో చాలా లక్షణాలు ఇదివరకే బయట పడ్డాయి. ఏ లక్షణాలు లేనివారికి కూడా పాజిటివ్ వచ్చింది. అప్పట్లో నాలుకకు రుచి, ముక్కు వాసన రాదని నిపుణులు గుర్తించారు. అయితే తాజాగా మరొ కొన్ని కొత్త లక్షణాలు బయట పడ్డాయి. కరోనా వైరస్ వల్ల బాధితుల్లో ఇలాంటి నోటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తాయి. నేచర్ మెడిసిన్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురింపబడిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తాజా నివేదిక ప్రకారం.. కరోనా వైరస్‌తో బాధపడే చాలా మంది నోటి ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలు కరోనా వైరస్‌ లక్షణాలుగా ప్రజలు గుర్తించలేరని, అసింప్టోమాటిక్ కేసులలో ఈ లక్షణాలు ఉన్నాయని నివేదికలో వెల్లడించారు.

నోరు పొడిబారడం..
కరోనా వైరస్ సోకినప్పుడు బాధితుడికి నోరు మొత్తం పొడిబారుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. నోరు మొత్తం డ్రైగా ఉంటుందని, నోరులో లాలాజల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. నాలుక మందంగా మారుతుందని, దీని వల్ల తినే ఆహారం నమలడానికి, మాట్లాడటానికి కష్టంగా ఉంటుందన్నారు. అలాగే నోటి నుంచి దుర్వాసన వెలువడుతుందన్నారు. నోటిలో లాలాజలం ఉత్పత్తి అయినప్పుడు చెడు బ్యాక్టీరియాలు, ఇతర వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ దొరకుతుందని, జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుందన్నారు.

నోటిలో గాయాలు.. మంట..
కరోనా వైరస్‌తోపాటు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మీ నాలుక మండుతున్నట్లు అనిపిస్తుంది. వైరల్ నాలుక కండరాలపై, ఓరల్ లైనింగ్స్‌పై దాడి చేసినప్పుడు నాలుకపై మంట ఏర్పడుతుంది. ఫలితంగా నాలుకలో గాయాలు, పుండ్లు ఏర్పడవచ్చు. నోటి పూతకూ దారితీస్తుంది. దీంతో మీరు కొన్ని ఆహార పదార్థాలను తినలేరు. అలాగే కొందరు రోగుల్లో చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయి.

నాలుక రంగు మారడం..
కరోనా వైరస్ నాలుకపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. వైరస్ తీవ్రత ఎక్కువైనప్పుడు నాలుక సైజుతోపాటు నాలుక రంగు కూడా మారుతుంది. నోటి దగ్గరుండే గవద బిల్లలు వాపునకు గురవుతాయి. దీనివల్ల నోటిలో లాలాజల ఉత్పత్తి, నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తాయి. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు బాధితులు లేట్ చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అప్పుడే వైరస్‌ను అరికట్టగలమని వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news