అంతగా కేసుల్లేవు.. కర్ఫ్యూ అక్కర లేదు. హై కోర్ట్ కు ప్రభుత్వం నివేదిక

-

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్ట్ లో నేడు విచారణ జరిగింది. ప్రభుత్వం హైకోర్ట్ కరోనా పరిస్థితులపై నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతగా లేవని, కర్ఫ్యూ అక్కర లేదని హైకోర్ట్ కు నివేదిక సమర్పించింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించేలా కేసులు లేవని.. పాజిటివిటీ రేటు కేవలం 3.16 శాతంగానే ఉందని.. 10 శాతం దాటితేనే కర్ఫ్యూ అవసరం అని ప్రభుత్వం హైకోర్ట్ కు వెల్లడించింది. ఒక్క జిల్లాలో కూడా 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు లేదని, మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతంగా, అతితక్కువగా 1.14 శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ కోర్టుకు నివేదిక ఇచ్చింది.

రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టుల వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక రూపంలో అందించింది. వారం రోజులుగా రాష్ట్రంలో లక్షకు పైగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫివర్ సర్వేలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలను సమర్పిస్తుందని పిటిషనర్లు హైకోర్ట్ కు విన్నవించారు. ప్రభుత్వ కిట్ లో పిల్లలకు అవసరమైన మందులు ఉండటం లేవని పిటీషనర్లు తెలిపారు. మాస్కులు, భౌతిక దూరం పాటించకపోవడం దురద్రుష్టకరమని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తరుపది విచారణకు డీహెచ్ హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 28 కి వాయిదా వేసింది హైకోర్ట్.

Read more RELATED
Recommended to you

Latest news