కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇటువంటి నకిలీ వార్తలు చూసి చాలా మంది మోసపోతున్నారు. అయితే తాజాగా మరోక వార్త వచ్చింది. అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం, కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఇప్పుడు కూడా కరోనా బారిన పడుతున్నారు.
అయితే కరోనాను తగ్గించడానికి ఆస్పిరిన్ ని ఉపయోగించాలని దీని వల్ల సమస్య తగ్గిపోతుందని.. వాట్సాప్ లో ఒక సర్క్యులర్ తిరుగుతోంది. సింగపూర్ రిపోర్ట్ ప్రకారం కరోనా వైరస్ వైరస్ కాదని అది బ్యాక్టీరియా అని రేడియేషన్ వలన బ్యాక్టీరియా వస్తుందని అందులో ఉంది. పైగా సింగపూర్ ప్రభుత్వం కరోనా మహమ్మారి సమస్యలు తొలగించడానికి ఆస్పరిన్ ని ఉపయోగిస్తుందని ఆ మెసేజ్ లో ఉంది.
అయితే దీనిపై పీఐబి ఫ్యాక్ట్ చెక్ స్పందించి ఆ మెసేజ్ నకిలీది అని చెప్పేసింది. కరోనా మహమ్మారి పై వస్తున్న ఈ మెసేజ్ లో ఎలాంటి నిజం లేదని స్పష్టత చేసింది ఆస్పిరిన్ వంటి వాటితో ఇది తగ్గదు అని చెప్పేసింది కాబట్టి అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలని నమ్మొద్దు. అలానే ఎవరికీ పంపద్దు.