ఏపీకి మరో ముప్పు : థర్డ్ వేవ్ వస్తే.. 4.50 లక్షల మంది పిల్లలకు కరోనా!

ఏపీని కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కంటే ఎక్కువ కేసులు ఏపీలో నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఏపీకి మరో ముప్పు ఎదురవనుంది. ఏపీపై మూడో దశ కరోనా ప్రభావం తీవ్రంగా ఉండనుంది. మూడో దశ కరోనాపై ప్రాథమిక నివేదికలో భవిష్యత్‌ పరిణామాలను ఏపీ సర్కార్ నియమించిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ వివరించింది. 16 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించింది టాస్క్‌ఫోర్స్‌ కమిటీ.


టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు:
మూడో దశలో 18 లక్షల మందికి కరోనా సోకవచ్చు.
నాలుగున్నర లక్షల మంది చిన్నారులకు పొంచి ఉన్న కరోనా ముప్పు.
సుమారు 36 వేల మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరే సూచనలు.
దాదాపు 9 వేల మంది చిన్నారులకు ఐసీయూ చికిత్స అవసరం.
కరోనా మూడో దశ పీక్‌ స్టేజీలో రోజుకు 533 మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరే అవకాశం.
ఆస్పత్రుల్లో చేరే చిన్నారుల కోసం 2750 పడకలు అవసరం.
చిన్నారుల కోసం వేయి పీఐసీయూ బెడ్లు అవసరం.
20 పోర్టబుల్‌ ఎక్స్‌రే మిషన్లను అందుబాటులో ఉంచుకోవాలి.
చిన్నారులకు కరోనా చికిత్స కోసం 37 రకాల మందులను వినియోగించాలి.
చిన్న పిల్లల మాస్కులు, హెచ్‌ఎంఈ ఫిల్టర్లు, వెంటిలెటర్లను కొనుగోలు చేసుకోవాలని సూచన.
రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లల కోసం 700 వెంటిలేటర్లు సిద్దం చేసుకోవాలి.
చిన్న పిల్లల కోసం 15వేల యూరిన్‌ బ్యాగులను సిద్దం చేసుకోవాలి.
చికిత్స పొందే చిన్నారుల తల్లులకూ బెడ్లను సిద్దం చేసుకోవాలి.