ఐపీఎల్‌ను వీడని కరోనా భయం… వాంఖడేలో మరో ముగ్గురికి కరోనా

-

ఓ వైపు ఐపీఎల్‌ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గర పడుతున్న వేళా మెగా టోర్నీకి కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్ళు, స్టేడియం సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా ముంబయిలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో మరో ముగ్గురికి తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. కాగా వారం క్రితమే వాంఖడే స్టేడియంలో పనిచేసే మొత్తం పది మందికి వైరస్‌ సోకింది. తాజాగా మరో ముగ్గురు కరోనా బారిన పడడం ఇపుడు ఆందోళన కలిగిస్తుంది.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే ముంబయిలో కరోనా తీవ్రరూపం దాలుస్తుంది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలో సోమవారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. అలానే కరోనా కట్టడికి వారాంతంలో లాక్‌డౌన్‌ కూడా అమలు చేస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు రాత్రి 8 గంటల తర్వాత ప్రాక్టీస్‌ చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ముంబయిలో ఐపీఎల్‌ మ్యాచ్‌లపై అటు బీసీసీఐ, ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసాయి. వాంఖడేలో యథాతథంగా మ్యాచ్‌లు నిర్వహిస్తామని వెల్లడించాయి.

కాగా ఏప్రిల్ 9వ తేదీ (శుక్రవారం)నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న విషయం తెల్సిందే.చెన్నై వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. శనివారం నాడు రోజు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ముంబయి వేదికగా పోటీపడనున్నాయి. మరో మూడు రోజుల్లో ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు బీసీసీఐకి, జట్ల యాజమాన్యాలకు కరోనా టెన్షన్ పట్టుకుందనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news