ఏపీలో తగ్గని కరోనా జోరు.. 24 గంటల్లో భారీగా నమోదైన కేసులు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజగా ఏపీలో గడిచిన 24 గంటల్లో 9024 కొత్త కేసులు రాగా, మ‌రో 87మంది మ‌ర‌ణించారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,44,549కు చేర‌గా, మ‌ర‌ణాల సంఖ్య 2203కు చేరింది.

అయితే రాష్ట్రంలో ప్ర‌స్తుతం 87,597యాక్టివ్ కేసులుండ‌గా… 1,54,759మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ 58,315మందికి కరోనా టెస్ట్ చేయ‌గా… ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 25, 92,619మందికి టెస్టులు చేసిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. అయితే గడిచిన 24 గంటల్లో సంభవించిన మరణాలలో ఎక్కువగా అనంత‌పురంలో 13, చిత్తూరు 12, గుంటూరులో 9 నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news