తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,963 కరోనా కేసులు నమోదు కాగా, 52 మంది మరణించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 1,411 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,714కి చేరింది. వీరిలో కరోనా నుంచి 19,223 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 586 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 21,905 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
#COVIDUpdates: 18/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 41,714 పాజిటివ్ కేసు లకు గాను
*19,223 మంది డిశ్చార్జ్ కాగా
*586 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 21,905#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rb6RQCyWLJ— ArogyaAndhra (@ArogyaAndhra) July 18, 2020
అలాగే తెలంగాణలో కొత్తగా 1,284 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో ఆరుగురు మరణించారు. అత్యధికంగా హైదరాబాద్‌లోనే 667 మంది కరోనా బారిన పడ్డారు. తాజా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43,780కి చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకొని 30,607 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 403 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 12,765 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 18.07.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/ShYpOQRgzD
— Eatala Rajender (@Eatala_Rajender) July 18, 2020