ఇక నుంచి పది నిమిషాల్లో కరోనా పరీక్షలు…

-

కరనా టెస్టుల్లో స్పీడ్ పెంచేందుకు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిన ప్రయోజం విజయవంతమైంది. వైరస్ ను పది నిమిషాల్లో గుర్తించే పరికరాన్ని అభివృద్ది చేసింది సంస్థ. రక్తం లేదా స్వాప్ లోని వైరస్ ను గుర్తించేందుకు చౌకగా దొరికే సెన్సార్లను ఉపయోగించారు సైంటిస్టులు. అంతేకాదు. ఈపరికరాన్ని ఇంట్లో ఎవరికీ వారే వాడి వైరస్ ఉనికి తెలుసుకోవచ్చు. గ్రాఫిన్ పొరసాయంతో గతంలోనే సైంటిస్టులు గౌట్ లాంటి వ్యాధులను గుర్తించే పద్దతిని అభివృద్ది చేశారు. లేజర్ కిరణాల సాయంతో ప్లాస్టిక్ పొరపై అతి సూక్ష్మమైన కంతలను ఏర్పాటు చేయడం..వీటిల్లో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ సృష్టించే యాంటీబాడీలను జోడించడం ప్రధానమైంది.

ర్యాపిడ్ ప్లెక్స్ అని పిలవబడే ఈ కొత్త పరికరంలో యాంటీబాడీలతో పాటు కొన్ని ప్రోటీన్లు కూడా ఉంటాయి. దీంతో వైరస్ ను గుర్తించడంతో పాటు రోగ నిరోదక వ్యవస్థ, వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చంటున్నారు సైంటిస్టులు. ఇలా ఒకే సమయంలో మూడు అంశాలను తెలుసుకోవడంతో చికిత్సకు ఈజీ అవుతుందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news