సాధారణంగా రాజకీయ నాయకులు.. రాజకీయంగా ప్రత్యర్ధులైనా కూడా సినిమాల్లో చూపించినట్లుగా… తెరముందు శత్రువులుగా, తెర వెనుక రహస్య మిత్రులుగా ఉంటారని అంటుంటారు రాజకీయ పండితులు.. చాలా సినిమాల్లో కూడా చూపించినట్లు! అధికారంలో ఎవరున్నా ఒకరికి ఒకరు కాస్త తోడుగా ఉండాలని.. రహస్య ఒప్పందం కూడా అనధికారికంగా ఉంటుందని అంటుంటారు! అయితే అది జగన్ విషయంలో చంద్రబాబుకు దక్కకపోవచ్చు!
చంద్రబాబు రాజకీయంగా మహా మేధావి! కేంద్రంలో బీజేపీనే ఆటలో అరటిపండును చేసి రాజకీయం చేయగల నేర్పరి. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీ స్థాపించబడిందో.. అదే కాంగ్రెస్ తో చేతులు కలపగల వ్యక్తి! మరి అలాంటి చంద్రబాబుకు.. జగన్ ఎందుకు లొంగడం లేదు! బాబు రాజకీయాలకు జగన్ ఎందుకు తలొంచడం లేదు! అది జగరని అని కాబట్టి!
జగన్ ది చాలా మంది నాయకుల్లా.. మీది తెనాలి మాది తెనాలి వ్యక్తిత్వం కాదని సన్నిహితులు చెబుతుంటారు! ఒక సారి మైండ్ లో ఫిక్సయిపోతే బ్లైండ్ గా ముందుకు వెళ్లిపోతారని.. పైగా ఫిక్సయ్యే ముందు చాలా పక్కాగా స్కెచ్ వేసుకుని ఫిక్సవుతారని అంటుంటారు! అందులో భాగంగా బాబు & కో మీద పక్కా వ్యూహంతో అటు రాజకీయంగా ఇటు ఆర్ధికంగా చాలా పక్కాగా.. చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు విశ్లేషకులు!
ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి “మా వాళ్లను” కాస్త చూసీ చూడనట్లు నడుచుకోండి.. తర్వాత మేము అధికారంలోకి వచ్చాక “మీ వాళ్లను” కూడా అలానే చూసీ చూడనట్లు ఉంటామని చెబితే జగన్ దగ్గర చెల్లదు! ఎందుకంటే.. జగన్ కి తెలుసు.. తనను జనం నమ్మారని, జగన్ జనాలను నమ్మారని.. ఆ విషయంలో వంచనకు తావు లేదని!