కరోనా వ్యాక్సిన్ బ్లూ ప్రింట్ రెడీ: కేంద్రం

-

కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ విషయంలో చాలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, సంబంధిత వాటాదారులందరితో… చర్చించి టీకా నిల్వ, పంపిణీ వంటివి ప్రభుత్వం వివరణాత్మక బ్లూ ప్రింట్‌ ను సిద్ధం చేసినట్లు జాతీయ నిపుణుల బృందం తెలిపింది. నిపుణుల బృందం, రాష్ట్రాలతో సంప్రదించి, టీకాల ప్రాధాన్యత మరియు పంపిణీపై చురుకుగా పనిచేస్తోంది.

తాజాగా ఒక సమావేశం నిర్వహించారు. ఇక దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాక్సిన్‌ ను త్వరగా పొందేలా చూడాలని ప్రధాని ఆదేశించారు. లాజిస్టిక్స్, డెలివరీ మరియు పరిపాలనలో అడుగడుగునా కఠినంగా ఉండే విధంగా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసారు. కోల్డ్ స్టోరేజ్ చైన్ అధునాతన ప్రణాళిక, పంపిణీ నెట్‌ వర్క్, పర్యవేక్షణ విధానం, ముందస్తు అంచనా వేసి సిరంజీలు వంటివి రెడీగా పెట్టుకోవాలని మోడీ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news