కరోనా టీకాపై సీరం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు..?

-

ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం మహమ్మారి కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. చైనాలో నుంచి వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఏదో విధంగా పంజా విసురుతూ ప్రాణాలను బలితీసుకుంది ఈ మహమ్మారి వైరస్. ఈ క్రమంలోనే ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా.. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా వైరస్ రానున్న రోజుల్లో ఒక సాధారణ ఫ్లూ మాదిరిగా కొనసాగే అవకాశముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఇదే విషయంపై సీరమ్ సీఈఓ ఆదార్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాకు 100% కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించినప్పటికీ కూడా రానున్న రోజుల్లో దాదాపు 20 సంవత్సరాల పాటు కరోనా వ్యాక్సిన్ అవసరం అంటూ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పటివరకు ఎన్నో వైరస్లకు టీకాలు కనుగొన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో నిలిపి వేయలేదు… దీన్ని బట్టి చూస్తే దాదాపుగా రానున్న సంవత్సరాల్లో కూడా కరోనా టీకా అవసరం అయ్యే అవకాశాలు ఉన్నాయని.. దాదాపు రెండు నుంచి మూడేళ్ల లోపు మళ్ళీ టీకా అవసరం రావచ్చు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news