పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు ఇటీవలే తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరలో దాదాపు 20 వేలకుపైగా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అంటూ తెలిపారు హోం మంత్రి మహమ్మద్ అలీ. ఇటీవలే రాష్ట్ర పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 1162 మంది ఎస్ఐలు పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ హోం మంత్రి మహ్మద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హోం మంత్రి మహ్మద్ అలీ తో పాటు డీజీపీ మహేందర్రెడ్డి కూడా హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి మహమ్మద్ అలీ ఇప్పటికే 18428 మంది ఎస్సై కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసాము తెలిపిన ఆయన.. రానున్న రోజుల్లో మరో 20 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.