తెలుగు రాష్ట్రాల్లో కమ్మేస్తున్న కరోనా…

-

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణాలో కేసులు 600 మార్క్ దాటాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 500 మార్క్ కి దగ్గరగా ఉన్నాయి. ఇవి రోజు రోజుకి పెరగడం తో ముఖ్యమంత్రుల్లో కంగారు మొదలయింది. ఇన్నాళ్ళు ప్రమాదం లేదు అనుకున్నా సరే కేసులు పెరుగుతున్నాయి.

అన్ని జిల్లాలలోను కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకారం చూస్తే 1100 కేసులు నమోదు అయి దేశంలో మన తెలుగు రాష్ట్రాలు మూడో స్థానంలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత మనదే ఆ స్థానం. దీనిపై ఇప్పుడు ముఖ్యమంత్రులు వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నారు.

తెలంగాణాలో కరోనా కేసులు 624 ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 483 కి చేరుకున్నాయి. దీనిపై కేంద్రం కూడా ఆరా తీస్తుంది. అసలు మన రాష్ట్రాలలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉండేది. మర్కాజ్ యాత్రికులు వెళ్లి వచ్చిన తర్వాతి నుంచి రోజు రోజుకి కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇక పరిక్షలు పూర్తి స్థాయిలో జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనే ఆందోళన ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలను కలవర పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news