ఇండియాకు అమెరికా గుడ్ న్యూస్…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో అగ్ర రాజ్యం అమెరికాలో తమ ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీసాల గురించి అక్కడి ఉద్యోగులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌-1బీ వీసాల గడువు ముగిసిపోతున్న భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. వీసాల గడువును పొడిగించడానికి గాను అమెరికా రెడీ అయింది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తన వెబ్‌సైట్లో ఒక ప్రకటనలో పేర్కొంది.

కరోనా నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌ సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరిస్తామని వివరించింది. అమెరికాలో ఉన్న భారతీయులకు అన్ని రకాల వీసాలను పోడిగించాలి అని విజ్ఞప్తి చేసింది కేంద్రం. అమెరికాలో ఉంటున్న హెచ్1 బీ ఉద్యోగులు వీసా పొడిగింపు దరఖాస్తు పెడితే, ప్రస్తుతం కంపెనీ పాత ఉద్యోగ నిబంధనలతోనే ఆ దరఖాస్తును ధ్రువీకరిస్తే 240 రోజుల వరకు హెచ్‌-1బీ వీసాను పొడిగించే అవకాశం ఉందని హోం ల్యాండ్ వివరించింది.

గడువులోగా దరఖాస్తు చేయలేక పోయినా సరే, ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను అత్యంత అసాధారణ పరిస్థితుల కోణంలో సానుభూతితో పరిశీలిస్తామని వివరించింది. కాగా విద్యార్ధుల పరిస్థితి ఏంటీ అనేది స్పష్టత లేదు. అక్కడి విద్యార్ధుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. లక్షల మంది విద్యార్ధుల విషయంలో అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news