కరోనా మరణాల విషయంలో చైనా దొరికిపోయింది…!

-

చైనాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. అక్కడి ప్రజలు అందరూ కూడా కరోనా వైరస్ దెబ్బకు భయపడిపోయారు. వేలాది మంది ఈ వైరస్ తీవ్రత తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్ధికంగా, శాస్త్ర సాంకేతిక పరంగా చైనా ఎంతో అభివృద్ధి చెందిన దేశం. అలాంటి దేశం కరోనా వైరస్ విషయంలో దాదాపుగా భయపడిపోయింది. దాన్ని కట్టడి చెయ్యలేక ఇబ్బంది పడింది.

వ్యూహాన్ సహా పలు నగరాల్లో కరోనా వ్యాప్తి అనేది చాలా తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది మాత్రం కట్టడి కాలేదు. ఈ తరుణంలోనే అక్కడ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా సహా అక్కడి వెబ్ సైట్లు చెప్తే చైనా నోరు మూయించింది. కాని అక్కడ కరోనా కారణంగా దాదాపు 70 వేల మంది చనిపోయారని అంచనా…

కాని చైనా బయటి ప్రపంచానికి ఆ సంఖ్యను దాచి చెప్పింది అంటున్నారు. ఊహాన్ నగరంలోనే దాదాపు 40 వేల మంది మరణించారు. అక్కడి ప్రజలు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. 26-40 వేల మంది మరణించి ఉంటారని స్థానికులు చెప్తున్నారు. ఏడు శ్మశాన వాటికలు నగరంలో ఉన్నాయి. వాటిల్లో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 4 మధ్య సగటున రోజుకి 3500 చితాభస్మం కుండలను పంపిణీ చేస్తాయని అంచనా వేస్తున్నారు.

చనిపోయిన వారి స్మారకార్థం అక్కడ కింగ్‌మింగ్‌ అనే పండుగను ప్రజలు జరుపుకొంటారు. అంటే ఈ 12 రోజుల కాలంలో దాదాపు 42వేల కుండలను ఇస్తారు. ఆ దేశంలో ప్రతీ ఏటా మరణాల రేటు ప్రకారం లెక్కిస్తే గత రెండున్నర నెలల్లో వుహాన్‌లో 16,000 మంది చనిపోతారని అక్కడి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇచ్చేది 42 వేల కుండలు. అంటే 26 వేల మంది అక్కడ చనిపోయారు. ఈ సంఖ్య చాలా ఎక్కువ అనేది అక్కడి ప్రజల మాట.

Read more RELATED
Recommended to you

Latest news