నవంబర్ లో జరగబోయేది తట్టుకోలేరు అంటున్న సైంటిస్ట్ లు .. ఏం జరగనుంది ?

-

చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలో మరణ కేకలు పుట్టిస్తోంది. గత ఏడాది నవంబర్ లో బయటపడిన ఈ వైరస్ వల్ల చైనా దేశంలో బాగా ప్రాణ నష్టం జరిగింది. మనిషి నుండి మనిషికి అంటురోగం గా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీంతో మెల్లమెల్లగా ఈ వైరస్ చైనా నుండి ఇతర దేశాలకు పాకింది. దాదాపు ప్రపంచంలో 190 దేశాలకు పైగా ఈ వైరస్ ప్రస్తుతం వ్యాపించి ఉంది. ఎక్కువగా యూరప్ మరియు అమెరికా దేశాలలో వైరస్ ప్రభావం గట్టిగా ఉంది. దీంతో ప్రపంచ దేశాలు మందులేని ఈ వైరస్ ని ఎదుర్కొనటానికి మార్గం లేక నియంత్రణ ఒకటే కావటంతో దాదాపు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.Home kit for Coronavirus detection Archives - Express Computerఇటువంటి తరుణంలో చైనాలో ఈ వైరస్ ప్రభావం తగ్గింది అనుకొన్న టైములో అక్కడి వైద్యులు షాక్ ఇచ్చే వార్త తెలియజేశారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన వ్యక్తి క్వారంటైన్ నుంచీ కొల్కుని వెళ్ళిన తరువాత కూడా మళ్లీ పాజిటివ్ రిపోర్ట్ వస్తుందని తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో క్వారంటైన్ నుంచీ కొల్కుని వెళ్ళిన తరువాత కూడా పది రోజులు సదరు వ్యక్తి వద్దకు ఎవరు వెళ్లకూడదని హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే టైమ్ లో చైనా శాస్త్రవేత్తలు ప్రపంచం నివ్వెరపోయే విషయాన్ని తెలియజేశారు.

 

అదేమిటంటే వచ్చే నవంబర్ నుండి కరోనా వైరస్ రెండవ దశ స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. చల్లగా ఉండే ప్రాంతాలలో ఈ వైరస్ చాలా బలంగా ఉంటుందని… అందువల్లే యూరప్ మరియు అమెరికా చోట్ల ఈ వైరస్ విజృంభిస్తోంది అని తెలిపారు. ప్రస్తుతం ఆసియా ఖండంలో ఉన్న దేశాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని అనుకుంటున్నారు కానీ నవంబర్ నెల నుండి ఆసియా ఖండంలో ఈ వైరస్ ఊహించని విధంగా ప్రళయం సృష్టించడం గ్యారెంటీ అని అంటున్నారు. నవంబర్ లో ఆసియాలో కరోనా వైరస్ సృష్టించే విధ్వంసానికి ఎవరు తట్టుకోలేరని సైంటిస్టులు అంటున్నారు. ఇక యూరప్ లో ఉన్న కొద్దీ ఈ వైరస్ ఇంకా బలపడుతుందని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news