ప్ర‌పంచ‌వ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్.. పెరుగుతూ వ‌స్తోన్న మృతుల సంఖ్య‌

-

చైనా లో కరోనా వైరస్ ప్రభంజనం సృష్టిస్తుంది. దీని ఉదృతి రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతుంది. కరోనా వైరస్ వలన చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. కరోనా వైరస్ మృతుల సంఖ్య 318కి చేరిన‌ట్టు తెలుస్తోంది. చైనాలో మ‌రో 4,200 మందికి కరోనా వైరస్ సోకిన‌ట్టు స‌మాచారం. అలాగే శనివారం ఒక్క రోజే 121 మంది మృతి చిందిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటిదాకా 14 వేల మందికి ఈ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందట. దీనితో ఇతర దేశాల్లో వణుకు పుడుతుంది.

మరోవైపు చైనాను వణికిస్తోన్న మహమ్మారి భారత్‌లో కూడా అడుగుపెట్టింది. కేరళలో మొదటి కేసు నమోదు కావడంతో… అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీంతో ఇక్క‌డ‌ జనాలు ఈ కరోనా వైరస్ బీభత్సానికి భయబ్రాంతులకు గురౌతున్నారు. దీని నివారణ కు గట్టిగానే ప్రయత్నిస్తుండగా.. ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఈ వైరస్‌.. భారత్‌ సహా 20 దేశాలకు విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ’ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news