పాకిస్తాన్ దెబ్బకు ఆ రెండు రాష్ట్రాలు భయపడిపోతున్నాయి… ఎందుకంటే..!

-

మొన్నటి వరకు మన దేశంలో చుక్కలు చూపించిన మిడతల దండు ఇప్పుడు పాకిస్తాన్ కి నరకం చూపిస్తుంది. పాకిస్తాన్ లోని రెండు, మూడు రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అవును ఇప్పుడు అక్కడ మిడతల దండు అక్కడి ప్రజలకు నరక౦ చూపిస్తుంది. వివరాల్లోకి వెళితే భారీ సంఖ్యలో మిడతలు గత ఏడాది మార్చ్ లో పాకిస్తాన్ లో అడుగు పెట్టాయి.

ఇక అక్కడి నుంచి కూడా ఆ దేశంలో వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు గా ఉన్న… సింధ్, దక్షిణ పంజాబ్, ఖైబర్ పష్తూన్ ఖ్వా రాష్ట్రాల్లో 9 లక్షలకు పైగా హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పంటలు, చెట్లను తినేస్తున్నాయి. పంట చేతికి రావడం ఇవి తినేయడం వంటివి జరుగుతున్నాయి. దీనితో అధికారులు ఇప్పుడు వాటి బారి నుంచి పంటలు కాపాడుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. పాక్ ప్రభుత్వం శనివారం జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది.

అటు రైతులు కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి పంట పొలాల్లోనే తిష్ట వేస్తున్నారు. సౌండ్ స్పీకర్లు, దప్పుల శబ్దం వంటివి చేస్తూ వాటిని తరమడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పాకిస్థాన్‌ నుంచి మన సరిహద్దు రాష్ట్రాలు అయిన రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇవి ప్రవేశించగా అధికారులు సత్వర చర్యలు చేపట్టడంతో అవి దేశం నుంచి వెళ్ళిపోయాయి. వాస్తవానికి ఇవి ఇరాన్ లోని ఏడారి ప్రాంతం గుండా పాకిస్తాన్ లోకి వచ్చాయి. ఇప్పుడు అవి అక్కడి నుంచి మన దేశంలోకి వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news