దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుంది. ఇప్పటి వరకు రెండో దశలోనే ఉన్న ఈ వైరస్ ఇప్పుడు మూడో దశకు చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1258 మందికి కరోనా వైరస్ సోకింది. 32 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకు వంద మంది కరోనా నుంచి బయటపడ్డారు.
ఇక మహారాష్ట్ర, కేరళ సహా కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ విస్తరించడం తో అక్కడి ప్రభుత్వాలు జాగ్రత్తలు మరింతగా తీసుకుంటున్నాయి. ఇది పక్కన పెడితే తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఒక వ్యక్తిని ఆస్పత్రిలో జాయిన్ చేసారు కరోనా లక్షణాలతో. అతనికి కరోనా ఉందని నిర్ధారణ అయింది. అయితే అతను గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయాడు. అతని మీద పడి బంధువులు ఏడ్చారు.
11 మంది ఏడవడం తో ఆ 11 మందికి కరోనా సోకే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో వారు అందరిని ఐసోలేషన్ కి తరలించారు. వారి రక్త నమూనాలను సేకరించిన అధికారులు పరిక్షలకు పంపించారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి మృతదేహాలను వైద్యులు కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. తీసుకుని వెళ్లి కాల్చేస్తున్నారు.