ఒక దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ మూలకు వెళ్లినా అందరి నోట ఒక్క మాట కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. నిన్న మొన్నటి వరకు అగ్రరాజ్యంగా వెలుగొందిన అమెరికా పరిస్థితి ఈ వైరస్ వల్ల కాకా వికలమైంది. ప్రపంచంలోనే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇండియాలో ఈ వైరస్ ప్రభావం ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా దేశం మొత్తం 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించడంతో చాలావరకు కంట్రోల్ అయింది. ఏ టైంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నీ పగడ్బందీగా పాటిస్తున్నారు.దీంతో ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావడంతో కుటుంబ సభ్యుల మధ్య ఒక రకమైన భయం క్రియేట్ అయింది. వైరస్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలకు కూడా ధైర్యం చెప్పలేని పరిస్థితి ప్రతి ఇంటిలో నెలకొంది. టెక్నాలజీ మనుషులను దూరం చేస్తే తాజాగా వచ్చిన వైరస్ మాత్రం ఒకళ్ళని ఒకళ్ళు అంటుకోకుండా…ఒకవేళ సొంత రక్త సంబంధం కలిగిన మనిషి అయినా ముట్టుకున్నా గాని మనిషిలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తూ సొంత వారిని కూడా దూరం చేసే విధంగా కరోనా వైరస్ మనిషి జీవితంలోకి ప్రవేశించింది.
పూర్వం తాతలు స్పానిశ్ ఫ్లూ చూశారు కానీ మన తల్లి తండ్రులు ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు .. సొ వాళ్ళు కూడా మనకి ధైర్యం చెప్పే పరిస్తితి లేదు .. స్పానిష్ ఫ్లూ కారణం గా ఇండియా లో లక్షల మంది చనిపోయారు 1912 లో కానీ దీని మీద మన పెద్దలకి అవగాహన లేదు అప్పట్లో మీడియా లేకపోవడం వల్ల .. సొ మనకి ధైర్యం చెప్పేవారు లేకుండా పోయారు. మొత్తంమీద కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులకు మరియు పిల్లలకు ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసింది అని చెప్పవచ్చు.