టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 21 రోజుల దేశవ్యాప్త కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అనేక మంది కస్టమర్లు తమ మొబైల్ నంబర్లను రీచార్జి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. అలాంటి వారికి జియో శుభవార్త చెప్పింది. ఇకపై జియో కస్టమర్లు తమకు సమీపంలోని ఏటీఎంలలోనూ తమ జియో ఫోన్ నంబర్‌ను రీచార్జి చేసుకోవచ్చు. ఈ మేరకు జియో ఒక ప్రకటన చేసింది. నెట్‌బ్యాంకింగ్ లేని వారు, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్లను ఉపయోగించని వారు.. కేవలం షాపుల్లో మాత్రమే ఫోన్లను రీచార్జి చేసుకునేవారు.. ఈ విధంగా తమ ఏటీఎంలను ఉపయోగించి తమ ఫోన్లను రీచార్జి చేసుకోవచ్చు.
జియో కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న ఏటీఎం దగ్గరకు వెళ్లి అందులో కార్డు పెట్టి.. అనంతరం వచ్చే ఆప్షన్లలో రీచార్జి అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత తమ జియో ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి రీచార్జి మొత్తాన్ని నమోదు చేయాలి. అనంతరం ఏటీఎం పిన్ను నమోదు చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. దీంతో కస్టమర్ల ఫోన్ నంబర్ రీచార్జి అవుతుంది. వారి బ్యాంక్ అకౌంట్లో ఉండే నగదు ఆ మేర డెబిట్ అవుతుంది.
Recharge your Jio number at your nearest ATM. #JioTogether#CoronaHaaregaIndiaJeetega #StayHomeStaySafe #StayConnected #JioDigitalLife pic.twitter.com/ztXQ2YaKuc
— Reliance Jio (@reliancejio) March 29, 2020
ఇక ఈ సర్వీస్‌కు గాను జియో ఇప్పటికే దేశంలోని అనేక బ్యాంకులతో భాగస్వామ్యం అయ్యింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జియో కస్టమర్లు.. యాక్సిస్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐడీఎఫ్సీ, స్టాండర్ట్ చార్టర్డ్, ఎస్బీఐ ఏటీఎంలలో పైన తెలిపిన విధంగా తమ ఫోన్ నంబర్లను రీచార్జి చేసుకోవచ్చు. కరోనా లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మొబైల్ షాపులను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా షాపుల్లో ఎల్లప్పుడూ రీచార్జిలు చేసుకునే వారి కోసం జియో ఇలా ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తోంది. దీంతో వారు తమ ఏటీఎంలతోనే సులభంగా తమ ఫోన్ నంబర్లను రీచార్జి చేసుకోవచ్చు..!