చైనా వైర‌స్‌ను తుద‌ముట్ట‌స్తా: ట‌్రంప్‌

-

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి భారిన‌ప‌డి భార్య‌తోపాటు ట్రంప్ కూడా ద‌వాఖాన‌లో చికిత్స పొందిన సంగ‌తి తెలిసిందే. వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి భావోద్వేగంతో ప్ర‌సంగించారు. వైద్య, శాస్త్ర పరిజ్ఞానశక్తితోనే చైనా వైర‌స్‌ను పూర్తిగా తుద ముట్టిస్తామని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్పారు. కరోనా వైరస్‌ సోకి ఆస్పత్రిలో ఉన్న సమయంలో తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ట్ర‌పం్ ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కొవిడ్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో వైట్‌హౌస్ సౌత్‌ లాన్‌లో రిపబ్లికన్‌ మద్దతుదారులను ఉద్దేశించి బ్లూ రూం బాల్కనీ నుంచే ఆయ‌న ప్రసంగించారు. బైడెన్‌ అధికారంలోకి వస్తే డెమొక్రాటిక్‌ పార్టీ అమెరికాను సోషలిస్టు దేశంగా మారుస్తుందని ఆరోపించారు. నల్లజాతి, లాటిన్‌ అమెరికన్లకు ఆ పార్టీ వ్యతిరేకమన్నారు. డెమొక్రాట్లు అధికారంలో ఉన్న నాలుగు నగరాల్లో గత ఏడాది 1000 మందికిపైగా ఆఫ్రో అమెరికన్లు హత్యకు గురయ్యారని చెప్పారు. కాగా, ట్రంప్‌ హయాంలో నిరుద్యోగం పెచ్చరిల్లిందని డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ ఆరోపించారు. కాగా, ట్రంప్‌కు ఇక వైరస్‌ సోకే ప్రమాదం లేదని శ్వేతసౌధం వైద్యుడు సియాన్‌ కాన్లే చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news