చిన్నారి అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష..!

-

ఈ మధ్యకాలంలో న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులు చూస్తుంటే ప్రజల్లో న్యాయస్థానాలకు వెళితే న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతోంది. ముఖ్యంగా ఆడ పిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారికి న్యాయస్థానాలు కఠిన శిక్ష విదిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పలు కోర్టులు అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించాయి . తాజాగా ఏపీలో అత్యాచారం నిందితుడికి ఉరిశిక్ష విధించింది మహిళా సెషన్ కోర్టు.

గత ఏడాది నవంబర్లో ద్వారక అనే చిన్నారి ఇంటిదగ్గర ఆడుకుంటున్న సమయంలో పెంటయ్య అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేయడం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, నిందితుడికి కఠిన శిక్షలు విధించాలి అంటూ అప్పట్లో ఎంతో మంది నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. కాగా తాజాగా చిన్నారి ద్వారక అత్యాచారం కేసులో విజయవాడ మహిళా సెషన్ కోర్టు సంచలన తీర్పును వెలువరిస్తూ నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుడు పెంటయ్య కు ఉరి శిక్షను విధిస్తూ న్యాయమూర్తి ప్రతిభామూర్తి తీర్పునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news