ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి

-

భార‌త్‌లో ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్షవ‌ర్ధ‌న్ అన్నారు. దేశీయ ఫార్మా కంపెనీ భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ పూర్త‌యితే ఈ ఏడాది చివరి వ‌ర‌కు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామ‌ని అన్నారు. అయితే మ‌రోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంత‌క‌న్నా ముందుగానే అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.

covaxin may be available end of the year says union health minister

క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ పూర్తయి వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే ముందుగా 50 ల‌క్ష‌ల డోసుల‌ను అత్య‌వ‌స‌ర సేవ‌లు అందించే సిబ్బందికి ఇస్తామ‌న్నారు. ఇక కోవ్యాక్సిన్‌కు గాను ఇప్పటికే భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌తో ఐసీఎంఆర్ ఒప్పందం చేసుకున్నందున వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్ కాగానే వెంట‌నే వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేలా చూస్తామ‌న్నారు. అయితే 2021 ఆరంభం నుంచి కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల‌కు పెద్ద ఎత్తున పంపిణీ చేసే అవ‌కాశం ఉంద‌న్నారు.

కాగా భార‌త్ బ‌యోటెక్ తోపాటు జైడ‌స్ కాడిలాకు చెందిన మ‌రో వ్యాక్సిన్ కు కూడా ప్ర‌స్తుతం క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేప‌ట్టారు. దేశంలో మొత్తం 3 వ్యాక్సిన్ల‌కు ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఇదివ‌ర‌కే చెప్పారు. అందువ‌ల్ల ఈ 3 వ్యాక్సిన్లు వీలైనంత త్వ‌ర‌గా అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news