తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..!

-

తెలంగాణలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET-2020 దరఖాస్తు గడువు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ మరోసారి పెంచింది. ఆసక్తిగల విద్యార్థులు సెప్టెంబర్ 5 వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షకి సంబందించిన తేదీ కూడా త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది. టెన్త్ పాసైన విద్యార్థులు గురుకుల కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం అప్లై చేయొచ్చు.

TSRJC CET 2020 ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి. మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఏమైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను ఫోన్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news