కోవిడ్-19: ఫైబర్ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్..!

-

ఫైజర్ వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైనట్లు ప్రకటించిన విషయం అందిరికీ తెలిసిందే. ఈ ప్రకటనతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ను నిర్మూలించవచ్చని భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఫైజర్ వ్యాక్సిన్ వాడుతున్న వాలంటీర్లపై దుష్ర్పభావం చూపిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు ది ఇండిపెండెంట్ పత్రికలో వెలువడిన కథనాలు ఇలా ఉన్నాయి.

vaccine
vaccine

సాధారణంగా వైరస్ కి సంబంధించిన టీకాలు వేసుకున్నప్పుడు జ్వరం, నొప్పి వస్తాయి. అయితే ఫైజర్ టీకా వేసుకున్నాక నొప్పితో పాటు తల నొప్పి తీవ్రమైన హ్యాంగోవర్ ఉంటుందని వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు వెల్లడించారు. ఆరు దేశాలకు చెందిన దాదాపు 43 వేల మందికి పైగా ఫైజర్ బయోఎన్ టెక్ ల టీకా మూడ దశలు ప్రయోగాలు చేపట్టారు. టీకా తీసుకున్న తర్వాత తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించినట్లు కొంత మంది వాలంటీర్లు పేర్కొంటున్నారు. మొదటి దశలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువేనని, రెండో దశలో ఆ లక్షణాలు తీవ్రంగా ఉన్నాయని 45 ఏళ్ల వాలంటీర్ చెప్పుకొచ్చాడు. టీకా వేసుకున్నాక తీవ్రమైన హ్యాంగోవర్ గా అనిపించిందని టెక్సాల్ కు చెందిన మరోక వాలంటీర్ చెప్పారు. కానీ, కొంత సమయానికి పరిస్థితి మెరుగుపడినట్లు పేర్కొన్నారు.

కోవిడ్ పై ఫైజర్ టీకా ప్రభావవంతంగా పనిచేస్తోందని ఫైజర్ చైర్మన్ అల్బర్ట్ ఇప్పటికే పేర్కొన్నారు. మూడు దశలు విజయవంతమయ్యాయని ఆనందం వ్యక్తం చేసి.. ఇదోక గొప్ప రోజుకు అభివర్ణించారు. అయితే తుది దశ ప్రయోగాల
తర్వాత వాలంటీర్లకు సంబంధించిన రెండు నెలల పూర్తి విశ్లేషణ సమాచారాన్ని అందించాల్సి ఉంది. నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం పోందాలంటే ఆ సమాచారం కీలకం. ప్రస్తుతం ఫైజర్ ఆ సమాచారాన్ని సేకరించే పనిలో ఉంది. కానీ ఈలోపే వాలంటీర్లు సైడ్ ఎఫెక్ట్స్ గురించి వెల్లడించారు. వీటిని ఫైజర్ ఎలా స్వీకరిస్తుందో, ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news