పోలవరం, వెలిగొండ పై సీఎం జగన్ సమీక్ష…!

పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్‌-2 ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని జగన్‌ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తుకు నీరు చేరితే..పునరావాసం ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జగన్‌ స్పష్టం చేశారు. బ్యాక్‌వాటర్‌తో ఎక్కడా ఏ సమస్యలూ తలెత్తకూడదని అధికారులను ఆదేశించారు సీఎం జగన్‌ .

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తిచేసి నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చూడాలని, పోలవరం ప్రాజెక్టు అప్రోచ్‌, స్పిల్‌ ఛానెల్‌ పనులు మే నాటికి పూర్తిచేయాలని సూచించారు. అంతకు ముందే కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా పూర్తిచేయాలి స్పష్టం చేశారు. పోలవరం నుంచి విశాఖ తాగునీటి అవసరాలకు ప్రత్యేక పైప్‌లైన్‌ వేసే ఆలోచన ఉందని, ఎటువంటి పంపింగ్‌ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించేలా పరిశీలించాలన్నారు.