కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (18-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్ర‌‌‌వారం (18-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 18th september 2020

1. క‌రోనా టెస్టు చేశాక కేవ‌లం 90 నిమిషాల వ్య‌వ‌ధిలోనే క‌చ్చిత‌మైన ఫ‌లితం వ‌చ్చేలా లండ‌న్ సైంటిస్టులు నూత‌నంగా ఓ ప‌రిశోధ‌న చేప‌ట్టారు. డీఎన్ఏ న‌డ్జ్ అనే టెస్టుద్వారా కేవ‌లం 90 నిమిషాల వ్య‌వ‌ధిలోనే క‌రోనా టెస్టుకు అత్యంత క‌చ్చిత‌మైన ఫ‌లితం వ‌స్తుంద‌ని వారు తెలిపారు.

2. క‌రోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మ‌రో వ్యాధి వ్యాప్తి చెందుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ వ్యాధి అక్క‌డ ప్ర‌స్తుతం వేగంగా విస్త‌రిస్తోంది. బ్రూసెల్లోసిస్ అనే కొత్త వ్యాధి చైనాలో ప్ర‌స్తుతం వ్యాప్తి చెందుతోంది.

3. క‌రోనా జాగ్ర‌త్త‌ల‌తో ఏపీలో శ‌నివారం నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23న సీఎం జ‌గ‌న్ స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. 24న సీఎం జ‌గ‌న్ శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటారు.

4. ఏపీలో కొత్త‌గా 8,096 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,09,558కి చేరుకుంది. 5,177 మంది చ‌నిపోయారు. 84,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,19,891 మంది కోలుకున్నారు.

5. క‌రోనా వైర‌స్‌ను అణ‌చివేసేందుకు దేశాల‌న్నీ క‌ల‌సిక‌ట్టుగా ముందుకు రావాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. క‌రోనా వైర‌స్‌ను అడ్డుకునేందుకు ప్ర‌పంచ దేశాల‌న్నీ క‌ల‌సి ప‌నిచేయాల‌న్నారు.

6. క‌న్‌జ్యూమ‌ర్ పిర‌మిడ్స్ హౌజ్ హోల్డ్ స‌ర్వే చెప్పిన లెక్కల ప్ర‌కారం మే నుంచి ఆగ‌స్టు నెల‌ల మ‌ధ్య క‌రోనా కార‌ణంగా దేశంలో మొత్తం 66 ల‌క్ష‌ల మంది ఉద్యోగాల‌ను కోల్పోయారని వెల్ల‌డైంది. వారందరూ నిపుణులైన ఉద్యోగుల‌ని తేలింది.

7. దేశంలో కొత్త‌గా 96,424 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 52,14,678కి చేరుకుంది. 84,372 మంది చ‌నిపోయారు. 10,17,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 41,12,551 మంది కోలుకున్నారు.

8. తెలంగాణ‌లో కొత్త‌గా 2,043 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య‌ 1,67,046 కు చేరుకుంది. 1,016 మంది చ‌నిపోయారు. యాక్టివ్ కేసులు 30వేల‌కు పైగా ఉన్నాయి. 1.35 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు.

9. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 21,656 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 11,67,496కు చేరుకుంది. 31,791 మంది చ‌నిపోయారు. 8,34,432 మంది కోలుకున్నారు. 3,00,887 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

10. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,04,10,423గా ఉంది. మొత్తం 9,51,517 మంది చనిపోయారు. 2,20,92,762 మంది కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news